Sea: తూర్పుగోదావరి జిల్లాలో 2 కిలోమీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం... వీడియో ఇదిగో!

  • చింతలమోరిలో ఘటన
  • సునామీ హెచ్చరికల్లేకుండానే చొచ్చుకువచ్చిన సముద్రం
  • ఉప్పునీటితో నిండిపోయిన పంటపొలాలు
Sea comes forth in East Godavari district

ఇటీవల ఎంఫాన్ తుపాను రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపింది లేదు. అయితే ఎంఫాన్ తుపాను బంగాళాఖాతంలో కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. కానీ, ఎంఫాన్ తీరం దాటి రోజులు గడిచిన తర్వాత మరోసారి సముద్రం ముందుకు రావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం చింతలమోరిలో సముద్రం 2 కిలోమీటర్ల మేర ముందుకు వచ్చింది.

సాధారణంగా 50 మీటర్లు ముందుకు వస్తేనే ఎక్కువని భావిస్తుంటారు. అయితే, ఏకంగా రెండు కిలోమీటర్ల మేర సముద్రం చొచ్చుకురావడంతో ఇక్కడివాళ్లకు కూడా అర్థం కావడంలేదు. సహజంగా సునామీ సమయాల్లోనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని, సునామీ హెచ్చరికలు లేకుండానే ఇలా జరగడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. సముద్రం ముందుకు రావడంతో అక్కడి పంటపొలాలన్నీ ఉప్పునీటితో నిండిపోయాయి. సారవంతమైన తమ నేలలు సముద్రం నీటి కారణంగా పాడైపోయాయని అక్కడి రైతులు వాపోతున్నారు.

More Telugu News