మహేశ్ బాబు సినిమా పాటకు వెరైటీగా డ్యాన్స్ చేసి మాయమైన డేవిడ్‌ వార్నర్.. వీడియో వైరల్

25-05-2020 Mon 13:34
  • తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేసి అలరిస్తోన్న డేవిడ్
  • 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో మైండ్ బ్లాక్ పాటతో మరో వీడియో
  • 'వాడిని కొట్ట‌మ‌ను డప్పూ' అనే మ్యూజిక్‌తో వినూత్న వీడియో
David Warner to Mahesh babu Shadow batting and then you hear the wife and kids are home

తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ, డైలాగులు చెబుతూ టాలీవుడ్ అభిమానులను ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి అలరించాడు. 'షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే' అంటూ పేర్కొని బై బై అని ట్వీట్ చేశాడు.  

మహేశ్ బాబు నటించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో 'వాడిని కొట్ట‌మ‌ను డప్పూ' వ్యాఖ్యకు సంబంధించిన మ్యూజిక్‌ను ఆయన ఈ వీడియోకు జోడించాడు.  

కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నాడు.