టీటీడీపై స్పందించినందుకు మీకు కృతజ్ఞతలు పవన్ కల్యాణ్ గారు: ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు

25-05-2020 Mon 13:21
  • తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై స్పందించిన పవన్
  • జనసేనాని ట్వీట్‌పై ఐవైఆర్‌ స్పందన
  • ముఖ్యమైన సమస్యపై గళం విప్పారు
  • టీటీడీ రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారింది
iyr krishna rao on ttd

తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయ నాయకులకు టీటీడీ పునరావాస కేంద్రంగా మారిందన్నారు.

'ముఖ్యమైన సమస్యపై మీరు గళం విప్పినందుకు కృతజ్ఞతలు పవన్ కల్యాణ్ గారు. ప్రభుత్వం మంచి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది... మంచి ఉదాహరణగా నిలవాలి. టీటీడీ రాజకీయ నాయకులకు, వ్యాపారులకు పునరావాస కేంద్రంగా మారిన నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇంతకంటే గొప్ప విషయాలను ఊహించలేం' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.