చంద్రబాబు విశాఖ వెళుతుంటే విమానాన్ని రద్దు చేయించారు... ప్రభుత్వానికి అంత భయమెందుకు?: దేవినేని ఉమ

25-05-2020 Mon 13:10
  • గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించాలనుకున్న చంద్రబాబు
  • విశాఖ విమానం రద్దు
  • విశాఖ పర్యటన రద్దు చేసుకుని చంద్రబాబు అమరావతి పయనం
Devineni Uma accuses AP government over Chandrababu Vizag tour cancellation

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమానం రద్దు కావడంతో అమరావతి పయనమైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. రంగనాయకమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రశ్నలనే హైకోర్టు నేడు ప్రభుత్వాన్ని అడిగిందని ట్వీట్ చేశారు. చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు గౌరవించి ప్రభుత్వ అనుమతులతో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళుతుంటే విమానాన్ని ఎందుకు రద్దు చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అంత భయమెందుకో చెప్పండి ముఖ్యమంత్రి గారూ! అంటూ నిలదీశారు.