'గోవిందా... గోవిందా' అంటూ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన లోకేశ్

25-05-2020 Mon 12:45
  • పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టారు
  • అటువంటి వ్యక్తి దేవుడి మాన్యాలను ఎలా వదిలిపెడతాడు?
  • భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీవారికే ఉంది
lokesh fires on jagan

తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దేవుడి మాన్యాలను వదిలిపెడతాడు అనుకోవడం అత్యాశే అవుతుంది. భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీ వారికే ఉంది. గోవిందా... గోవిందా..' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా వార్తా పత్రికలో వచ్చిన ఓ వార్తను ఆయన పోస్ట్ చేశారు. అత్యంత ధనవంతుడైన తిరుమల వెంకన్న ఆస్తులను తితిదే అమ్మకానికి పెట్టిందంటూ అందులో పేర్కొన్నారు. శ్రీవారిపై భక్తి ప్రపత్తులతో దాతలు విరాళాలుగా సమర్పించుకున్న ఆస్తులు ఇప్పుడు 'నిరర్థకం' అయిపోయాయంటూ వాటిని అమ్మేందుకు సిద్ధమయ్యారని ఆ పత్రికలో ప్రచురించారు. భూముల విక్రయానికి ఇప్పటికే బృందాలను నియమించారని పేర్కొన్నారు.