Vijayashanti: చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి?

Vijayashanti to play a crucial role in Chiranjivis film
  • గతంలో హీరో హీరోయిన్లుగా నటించిన చిరు, శాంతి 
  • సుజిత్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్
  • హీరోకి చెల్లి పాత్రకు విజయశాంతి?
  • మలయాళంలో ఈ పాత్రలో మంజు వారియర్
చిరంజీవి, విజయశాంతిలది సూపర్ హిట్ కాంబినేషన్!
గతంలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించిన పలు  సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇక ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి త్వరలో చిరంజీవి నటించే సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మోహన్ లాల్ హీరోగా ఈమధ్య మలయాళంలో వచ్చిన హిట్ చిత్రం 'లూసిఫర్'ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఆచార్య' సినిమా తర్వాత ఇది సెట్స్ కి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇందులో విజయశాంతిని ఓ కీలక పాత్రకు అడుగుతున్నట్టు తెలుస్తోంది. మలయాళం ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ వేసిన పాత్ర ఇది. హీరో చిరంజీవికి చెల్లి పాత్ర. మొదటి నుంచీ కారణాంతరాల వల్ల అన్నని ఇష్టపడని చెల్లి తన పెళ్లి కూడా తన ఇష్టప్రకారమే చేసుకుంటుంది. పలు డైమన్షన్లు కలిగివున్న ఈ పాత్ర అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరి, ఇన్నాళ్లూ హీరో హీరోయిన్లుగా నటించిన చిరు, శాంతి జంట ఇలా అన్నా చెల్లెళ్లుగా నటిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు విజయశాంతి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారా? అన్నది చూడాలి!    
Vijayashanti
Chiranjeevi
Mohanlal
Manju Warrier
Sujith

More Telugu News