గోల్ఫ్ ఆడుతున్న గంటా శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో

25-05-2020 Mon 12:21
  • లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న టీడీపీ నేత
  • చాలా రోజుల తర్వాత గోల్ఫ్ ఆడానని వ్యాఖ్య
  • గోల్ఫ్ ఆడితే మనలోని శక్తిని పెంచుకున్నట్లేనన్న గంటా
Its been long Playing golf after many days after

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గోల్ప్ ఆడారు. ఈ సందర్భంగా వీడియో తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత గోల్ఫ్ ఆడానని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాల మధ్య గోల్ఫ్ ఆడడంలో ఆహ్లాదం మరే పనిలోనూ లభించదని చెప్పారు. గోల్ఫ్ ఆడితే మనలోని శక్తిని పెంచుకున్నట్లేనని, చిరునవ్వులు చిందిస్తూ సమయాన్ని గడపొచ్చని ఆయన అన్నారు.