పార్టీలో హుషారుగా డ్యాన్స్ చేసిన ఐశ్వర్య, దీపిక.. పాత వీడియో వైరల్

25-05-2020 Mon 11:54
  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు దీపిక, ఐశ్వ‌ర్యరాయ్ 
  • ప‌క్క‌కి వెళ్లి మరీ డ్యాన్స్
  • అభిమానులను అలరిస్తోన్న వీడియో
aish dancing with deepikapadukone

ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు దీపిక పదుకొనే, ఐశ్వ‌ర్యరాయ్ డ్యాన్స్ చేసిన పాత వీడియోను తాజాగా జూమ్‌ టీవీ పోస్ట్ చేసింది. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తుండడం అభిమానులను ఆకర్షిస్తోంది. ఇందులో రెడ్ కలర్ ఔట్‌ఫిట్ ధ‌రించి, చేతిలో డ్రింక్‌ పట్టుకుని దీపికా ప‌దుకొనే డ్యాన్స్ చేయగా, ఆమె ముందే నిలబడి ఐశ్వర్యరాయ్‌ డ్యాన్‌ చేసింది.

వీరిద్దరు ప‌క్క‌కి వెళ్లి మరీ డ్యాన్స్ చేయడం ఆకర్షిస్తోంది. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు విరామం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినీనటులు ఇంట్లోనే ఉంటున్నారు. గత వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ప్రస్తుతం దీపిక, ఐష్ చేతుల్లో పలు సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం మళ్లీ షూటింగుల్లో బిజీ కానున్నారు.