Kesineni Nani: టీటీడీ ఆస్తుల వేలంపై ప్రశ్నల వర్షం కురిపించిన కేశినేని నాని

  • టీటీడీ పేర్కొన్న 50 ఆస్తులు ఎలా నిరర్ధకం అయ్యాయి? 
  • ఎప్పటి నుండి నిరర్ధకం అయ్యాయి?
  • అవి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాయి?
  • కోర్టు వివాదాల్లో ఉన్నాయా?  
kesineni nani on ttd

నిరర్ధక ఆస్తుల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు రాష్ట్రాల్లోని ఆస్తులను వేలం వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శల జల్లు కురుస్తోంది. దీనిపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ ఆస్తులు నిరర్ధకం ఎలా అయ్యాయో చెప్పాలని ఏపీ సర్కారుని నిలదీస్తూ ట్వీట్ చేశారు.

'టీటీడీ పేర్కొన్న 50 ఆస్తులు ఎలా నిరర్ధకం అయ్యాయి? ఎప్పటి నుండి నిరర్ధకం అయ్యాయి? అవి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాయి? కోర్టు వివాదాల్లో ఉన్నాయా? వాటి నిర్వహణకు టీటీడీ చేస్తున్న వార్షిక వ్యయం ఎంత? అనే విషయాలు పై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి' అని కేశినేని నాని డిమాండ్ చేశారు.

More Telugu News