భూకంపంలోనూ భయపడకుండా లైవ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన న్యూజిలాండ్‌ ప్రధాని.. వీడియో ఇదిగో

25-05-2020 Mon 10:27
  • ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర ఐలాండ్‌లో భూకంపం
  • పార్లమెంట్‌ భవనం నుంచి ఓ ఛానెల్‌తో లాక్‌డౌన్‌పై మాట్లాడిన ప్రధాని
  • భూకంపం ధాటికి భవనం కదలగా నవ్వుతూ మాట్లాడిన వైనం
New Zealand Prime Minister Jacinda Ardern caught on camera as 5 magnitude earthquake

భూకంపంలోనూ న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డన్స్‌ భయపడకుండా టీవీలో లైవ్‌ ఇంటర్వ్యూ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర ఐలాండ్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో జెసిండా వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్‌ భవనం నుంచి ఓ ఛానెల్‌తో లాక్‌డౌన్‌పై ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

ఆ సమయంలో సంభవించిన భూకంపం ధాటికి భవనం కదలగా నవ్వుతూ మాట్లాడారు. అంతేగాక, ఆ‌ ఇంటర్వ్యూలో భూకంపం గురించి విశేషాలను చెప్పారు. ఇక్కడ చిన్న పాటి భూకంపం వచ్చిందని, భూమి కొద్దిగా కదులుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అక్కడి పరిసరాలు కదలడం వీడియోలో కనపడ్డాయి.