ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తున్నాను!: శ్రీవారి భూముల అమ్మకంపై నాగ‌బాబు

25-05-2020 Mon 09:53
  • తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడాలి
  • ఆ బాధ్యత తిరుపతి పాలక మండలిది
  • అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు
  • హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి
nagababu about ttd

తిరుమల శ్రీవారి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. 'ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి' అని అంటూ దీనిపై జనసేన నేత నాగబాబు ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా, మరోసారి ఈ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

'తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడే బాధ్యత తిరుపతి పాలక మండలిది. అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి. నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. కచ్చితంగా ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తున్నాను' అని నాగబాబు చెప్పారు.