భారత్‌లో గత 24 గంటల్లో 6,977 మందికి కరోనా నిర్ధారణ!

25-05-2020 Mon 09:26
  • 24 గంటల్లో 154 మంది మృతి
  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,021
  • కేసుల సంఖ్య మొత్తం 1,38,845
  • 77,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
Highest ever spike of 6977 COVID19 cases 154 deaths in India

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నాలుగు రోజులుగా 6,000పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
               
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,38,845కి చేరగా, మృతుల సంఖ్య 4,021కి చేరుకుంది. 77,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు 57,720 మంది కోలుకున్నారు.