40 మంది బంధుమిత్రుల నడుమ నిరాడంబరంగా ఐపీఎస్ అధికారి వివాహం

25-05-2020 Mon 09:25
  • పుట్టపర్తిలోని రిసార్ట్‌లో వివాహం
  • హాజరైన అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబు
  • భౌతిక దూరం పాటిస్తూ వధూవరులకు ఆశీర్వచనాలు
IPS Officer Manikantha Weds DSP Harshitha in Puttaparthi

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి మణికంఠ, డీఎస్పీ హర్షితల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఓ రిసార్ట్‌లో నిన్న జరిగిన వీరి వివాహానికి కేవలం 40 మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి హాజరైన వారందరూ భౌతిక దూరం పాటిస్తూ వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు హాజరయ్యారు.