హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు తీసుకోవడం మానేశా: ట్రంప్

25-05-2020 Mon 09:13
  • రెండు వారాలపాటు ఆ మాత్రలు వేసుకున్నానన్న ట్రంప్
  • లక్ష్యం నెరవేరడంతో మానేశానని వెల్లడి
  • హెచ్చరికలు బేఖాతరు చేసి మరీ మందులు వేసుకున్న అధ్యక్షుడు
Donald Trump Says that He stops using Hydroxychloroquine Tablets

కరోనా వైరస్  సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వాడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు వాటిని మానేసినట్టు తెలిపారు. రెండు వారాలపాటు ఈ మాత్రలు వాడానని, ఇప్పుడు తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. ఆ మాత్రలను ఎందుకు వాడానో ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.

కాగా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని స్వయంగా అమెరికా వైద్యులే చెప్పారు. అంతేకాదు, వాటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు కూడా తలెల్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, ఆ హెచ్చరికలను పక్కనపెట్టిన ట్రంప్ తాను హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వాడుతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన లక్ష్యం నెరవేరడంతో వాటి వాడకాన్ని నిలిపివేశానని ఆయన చెప్పారు.