పూరి దర్శకత్వంలో బాలయ్య సినిమా.. స్క్రిప్టు రెడీ!

25-05-2020 Mon 08:59
  • గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్'
  • కేన్సిల్ అయిన బి.గోపాల్ తో ప్రాజక్ట్
  • పూరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాలయ్య
  • బోయపాటి సినిమా తర్వాత ఇదే సెట్స్ కు
Poori to direct Balakrishna again

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తెలుగు, హిందీ భాషల్లో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రానికి కూడా స్క్రిప్టును అప్పుడే సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో పూరి చేయనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు కథను చెప్పడం, ఆయన ఓకే చేసేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించి పూర్తి స్క్రిప్టును కూడా పూరి అప్పుడే సిద్ధం చేసినట్టు సమాచారం. 'పైసా వసూల్' చిత్రం తర్వాత బాలకృష్ణ, పూరి కాంబోలో వస్తున్న సినిమా ఇది.  

ఇక, ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగు ఆగింది. త్వరలోనే షూటింగులు పునః ప్రారంభం కాగానే, బోయపాటి కూడా ఈ సినిమా షూటింగును మొదలెడతారు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తారంటూ నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజక్టు కేన్సిల్ అయిందట. ఆ స్థానంలోనే పూరి జగన్నాథ్ తో చేసే సినిమా ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.