కరోనా బారిన బాలీవుడ్ ఆర్టిస్ట్ కిరణ్ కుమార్... ఆరోగ్యం బాగానే ఉందన్న నటుడు!

25-05-2020 Mon 06:48
  • సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి
  • లక్షణాలు లేకున్నా కరోనా
  • ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో
Bollywood Actor Kiran Kumar tests positive for coronavirus

‘దడ్కన్’, ‘ముఝే దోస్తీ కరోగీ’ వంటి చిత్రాల్లో నటించి, అలరించిన బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ (74) కరోనా బారినపడ్డారు. తనలో ఎటువంటి లక్షణాలు లేకున్నా కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు. కిరణ్ ఈ నెల 14న సాధారణ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. అయితే, అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి కావడంతో ఆయన కూడా చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది.

నిజానికి తనలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ తనకు పాజిటివ్ వచ్చిందని కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని అన్నారు. రేపు కానీ, ఎల్లుండి కానీ మరోమారు కరోనా టెస్టు చేయించుకుంటానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. 74 ఏళ్ల కిరణ్ బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.