చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు.. రోడ్డు మార్గాన అమరావతికి!

25-05-2020 Mon 06:31
  • నేడు విశాఖ వెళ్లాలనుకున్న చంద్రబాబు 
  • ప్రయాణికులు లేని కారణంగా విమానాలు రద్దు
  • అక్కడి నుంచే మహానాడు కార్యక్రమాలు
TDP Chief Chandrababu Naidu Visakha Tour Cancelled

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నేటి విశాఖ పర్యటన రద్దు అయినట్టు తెలుస్తోంది. విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి రావడంతో విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే, ప్రయాణికులు తక్కువగా ఉన్న కారణంతో నేడు విశాఖ, విజయవాడ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దీంతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 27,28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాలకు చంద్రబాబు అక్కడి నుంచే హాజరు అవుతారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.