తెలంగాణలో ఇవాళ నలుగురు మృతి... 41 మందికి కరోనా పాజిటివ్

24-05-2020 Sun 20:40
  • ఇప్పటివరకు కరోనాతో 53 మంది మృతి
  • నేడు 24 మంది డిశ్చార్జి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 709
Four people died in Telangana due to corona

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ నలుగురు కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 53కి పెరిగింది. ఇక, కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

వారిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధికి చెందిన వ్యక్తులు కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఒకరున్నారు. 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. తద్వారా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,854కి పెరిగింది. కాగా, ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నారు.