ఇటీవలే ఉత్పత్తి ప్రారంభించిన హ్యుందాయ్, మారుతి... అంతలోనే ఉద్యోగులకు కరోనా పాజిటివ్
- ఇటీవలే కార్యకలాపాలు షురూ చేసిన ఆటోమొబైల్ సంస్థలు
- హ్యుందాయ్ చెన్నై ప్లాంట్ లో ముగ్గురికి కరోనా
- మారుతిసుజుకి యూనిట్ లో ఒకరికి పాజిటివ్
చెన్నైలోని హ్యుందాయ్ కార్ల ఉత్పత్తి కేంద్రంలో ముగ్గురికి, మనేసర్ లోని మారుతి సుజుకి కార్ల తయారీ యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో ఆయా యూనిట్లలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారితో కలిసి పనిచేసిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. వారు పనిచేసిన ప్రదేశాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. హ్యుందాయ్ యూనిట్ లో కరోనా బారిన పడిన ఉద్యోగుల్లో స్వల్పంగానే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, కొద్దిమేర జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని అధికారులు వివరించారు. వారితో సన్నిహితంగా మెలిగిన 16 మంది ఉద్యోగుల నుంచి నమూనాలు సేకరించి కరోనా టెస్టుకు పంపించారు. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి.