మహారాష్ట్రలో సాధువుల వధ... తెలంగాణలో పట్టుబడిన నిందితుడు!

24-05-2020 Sun 18:42
  • నాందేడ్ లో ఇద్దరు సాధువుల హత్య
  • సవాల్ గా తీసుకున్న పోలీసులు
  • నిర్మల్ జిల్లాలో నిందితుడి అరెస్ట్
  • డబ్బు కోసమే చంపానన్న నిందితుడు
Two Sadhus killed in Maharashtra

మహారాష్ట్రంలోని నాందేడ్ పట్టణంలో శనివారం రాత్రి ఇద్దరు సాధువులు విగతజీవుల్లా పడివుండడం సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సాధువుల మృతదేహాలు కనిపించడం దిగ్భ్రాంతి కలిగించింది. దీన్నో సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్ప వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పట్టుబడ్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, కేవలం డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్టు అంగీకరించాడు. అతడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆపై రిమాండ్ కు తరలించారు.