ఢిల్లీలో ప్రచండ భానుడి విశ్వరూపం

24-05-2020 Sun 14:29
  • ఇవాళ 47 డిగ్రీల ఉష్ణోగ్రత
  • వేడిగాలులతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి
  • వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
Heat wave rattles Delhi

మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం విపరీతంగా పెరిగిపోయింది. హస్తినలో ఇవాళ మధ్యాహ్నం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇప్పటికే వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  వచ్చే వారం మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, పిల్లలు, వృద్ధులు బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అటు, రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పశ్చిమ దిక్కు నుంచి వస్తున్న వేడి గాలులు, తీర ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.