Crime News: కరోనా పరీక్ష చేయించుకోవట్లేదని వ్యక్తిని కొట్టి చంపిన కజిన్స్‌!

cousins kills brother
  • ఉత్తరప్రదేశ్‌ బిజ్నూర్‌లోని మలక్‌పూర్‌ గ్రామంలో ఘటన
  • కర్రలతో దాడి చేసిన వైనం
  • పలువురిపై కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌ బిజ్నూర్‌లోని మలక్‌పూర్‌ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెబుతుంటే చేయించుకోవట్లేదని మంజీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని అతడి కజిన్స్ కొట్టి చంపేశారు. మంజీత్‌ సింగ్‌ ఇటీవల ఢిల్లీ నుంచి మలక్‌పూర్‌కు చేరుకున్నాడు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోవాలని అతడి కజిన్స్ కపిల్‌, మనోజ్‌ డిమాండ్ చేశారు.

అయితే, మంజీత్ కరోనా పరీక్షలు చేయించుకోవట్లేదు. దీంతో మంజీత్‌తో కజిన్స్ గొడవపడి కర్రలతో దాడి చేశారు. మంజీత్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని  తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, మంజీత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనపై అతడి తల్లి దండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. మంజీత్‌ కజిన్స్‌ కపిల్‌, మనోజ్‌తో పాటు వారి తల్లి పుణియా, మనోజ్‌ భార్య డాలీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. ఇటీవల మంజీత్ సింగ్ బిజ్నూర్‌కు చేరుకున్నాక అతడికి థర్మల్‌ స్కానింగ్ చేశామని, నెగిటివ్‌ రావడంతో అతని శాంపిల్స్‌ తీసుకోలేదని పోలీసులు వివరించారు.
Crime News
Uttar Pradesh

More Telugu News