Laser Wepon: లేజర్ వెపన్ ను సిద్ధం చేసిన అమెరికా... కాంతి పుంజంతో విమానం కూల్చివేత సక్సెస్!

  • యుద్ధ నౌక నుంచి ప్రయోగం
  • కాంతితో తొలిసారిగా విమానం కూల్చివేత
  • భవిష్యత్ యుద్ధ రీతి మారుతుందన్న పరిశోధకులు
US Tests Successfully Laser Wepon

గాల్లో ఎగురుతున్న విమానాన్ని ధ్వంసం చేసే అత్యాధునిక లేజర్ వెపన్ ను అమెరికా విజయవంతంగా పరీక్షించింది. ఓ యుద్ధ నౌక నుంచి దీన్ని మానవ రహిత విమానంపై ప్రయోగించామని యూఎస్ నేవీ వెల్లడించింది. భవిష్యత్తులో యుద్ధ రీతులు మారిపోతాయనడానికి ఇది సంకేతమని పరిశోధకులు వ్యాఖ్యానించారు.

ఎల్డబ్ల్యూఎస్డీ (లేజర్ వెపన్స్  సిస్టమ్ డిమాన్ స్ట్రేటర్)లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 16న యూఎస్ఎస్ పోర్ట్ ల్యాండ్ వార్ షిప్ నుంచి లేజర్ వెపన్ ను ప్రయోగించానని, గాల్లో ఎగురుతున్న విమానాన్ని ఇవి కూల్చాయని అధికారులు వెల్లడించారు. సాలిడ్ స్టేట్ లేజర్ ను వాడి, ఓ విమానాన్ని కూల్చివేయడం ఇదే తొలిసారని పరిశోధకులు వెల్లడించారు.

More Telugu News