Telangana: తెలంగాణలో ఇవాళ 52 కొత్త కేసులు... 25 మంది డిశ్చార్జి

Many more corona cases came to surface in Telangana
  • జీహెచ్ఎంసీ పరిధిలో 33 మందికి కరోనా
  • నేడు ఒక మరణం నమోదు
  • 49కి పెరిగిన మృతుల సంఖ్య
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడంలేదు. నేడు 52 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కి చేరింది. కొత్త కేసుల్లో 33 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మిగిలిన 19 మంది వలసకార్మికులు/విదేశాల నుంచి వచ్చిన వారు. కాగా, ఇవాళ 25 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,068కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 696 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, రాష్ట్రంలో నేడు ఒక మరణం నమోదు కావడంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 49కి పెరిగింది.
Telangana
Corona Virus
COVID-19
Positive
Deaths

More Telugu News