Mamata Banerjee: మమతా బెనర్జీ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం

Army Sends Troops As Bengal Asks For Help Dealing With Amphan
  • పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేసిన తుపాన్
  • సహాయక చర్యలకు సైన్నాన్ని పంపాలని కోరిన దీదీ
  • 5 కాలమ్స్ సైన్యాన్ని పంపిన కేంద్రం
ఎంఫాన్ తుపాను పశ్చిమబెంగాల్ ను అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యాన్ని పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఆమె విన్నపాన్ని కేంద్రం మన్నించింది.

మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనుల కోసం 5 కాలమ్స్ సైన్యాన్ని పంపింది. వీటిలో 3 కాలమ్స్ ను కోల్ కతాకు, మరో 2 కాలమ్స్ ను ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు పంపించింది. అధికార యంత్రాంగానికి ఈ సైన్యం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క కాలమ్ లో 35 మంది సైనికులు ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 26 బృందాలు పని చేస్తున్నాయి. అదనంగా మరో 10 బృందాలను పంపిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.
Mamata Banerjee
West Bengal
Cyclone
Amphan

More Telugu News