Black Box: పాకిస్థాన్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ లభ్యం

  • నిన్న పాకిస్థాన్ లో విమాన ప్రమాదం
  • కరాచీలో కుప్పకూలిన ప్రయాణికుల విమానం
  • బ్లాక్ బాక్స్ ను దర్యాప్తు బృందానికి అప్పగించిన అధికారులు
Pakistan officials found black box of crashed plane

పాకిస్థాన్ లోని కరాచీలో ఓ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం కూలిన ప్రదేశం నుంచి తాజాగా బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. లాహోర్ నుంచి కరాచీ వచ్చిన పీఐఏ విమానం ల్యాండింగ్ కు కొద్దిముందు ఎయిర్ పోర్టుకు సమీపంలోని జనావాసాల్లో కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 99 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, 97 మంది మరణించినట్టు తెలుస్తోంది.

బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో విమాన ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. కరాచీలోని జిన్నా గార్డెన్ ఏరియాలో దొరికిన బ్లాక్ బాక్స్ ను పీఐఏ అధికారులు దర్యాప్తు బృందానికి అప్పగించారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి ముందు విమానంలో సాంకేతిక పరంగా అసలేం జరిగిందన్న దానిపై స్పష్టత రానుంది. ప్రమాదంపై కాక్ పిట్ లోని పైలెట్లు ఏం మాట్లాడుకున్నారన్నది కూడా కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ద్వారానే తెలుస్తుంది. 

More Telugu News