Mamat: మా రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపించకండి ప్లీజ్: మమతా బెనర్జీ

  • అధికారులంతా తుపాను పునరావాస చర్యల్లో ఉన్నారు
  • 26వ తేదీ వరకు శ్రామిక్ రైళ్లను పంపించవద్దు
  • రైల్వే మంత్రికి మమత విన్నపం
Mamata says dont send Shramik trains

తమ రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపించవద్దని రైల్వే మంత్రిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఎంఫాన్ తుపాను సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమై ఉన్నారని... ఈ నేపథ్యంలో ఈనెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపించవద్దని విన్నవించారు.

తుపాను పునరావాస చర్యల్లో జిల్లాల అధికార యంత్రాంగమంతా బిజీగా ఉన్నారని... కొన్ని రోజుల పాటు శ్రామిక్ రైళ్లను రీసీవ్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని దీదీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ సిన్హా కూడా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ కు లేఖ రాశారు. తుపాను వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు శ్రామిక్ రైళ్ల విషయంలో గతంలో మమతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కరోనా సమయంలో వలస కార్మికులు బెంగాల్ కు తిరిగి రావడం మమతకు ఇష్టం లేదని... అందుకే శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదని దుయ్యబట్టారు. తుపాను విషయానికి వస్తే... బెంగాల్ లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. రూ. 1000 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రకటించారు.

More Telugu News