Anushka Sharma: అనుష్క శర్మ వెబ్ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

Complaint Against Anushka Sharma Over Comments On Gorkhas In Paatal Lok
  • 'పాతాళ్ లోక్' సిరీస్ ను నిర్మించిన అనుష్క
  • తమను కించపరిచారన్న గూర్ఖా సమాజం
  • డైలాగ్స్ మ్యూట్ చేయాలని డిమాండ్
ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ 'పాతాళ్ లోక్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. 'ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్' సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.

తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ వినపడకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన కొన్ని వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుష్కపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని తెలిపాయి.
Anushka Sharma
Web Series
Human Rights Commission
Gurkha

More Telugu News