Kanna Lakshminarayana: టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది?: ఏపీ సర్కారుపై కన్నా ఆగ్రహం

Kanna says government has no right to sell TTD assets
  • శ్రీవారి ఆస్తుల అమ్మకానికి టీటీడీ సిద్ధమైందంటూ కథనాలు
  • హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర అంటూ కన్నా వ్యాఖ్యలు
  • ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టీకరణ 
శ్రీవారికి సంబంధించిన విలువైన స్థిరాస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం అనేక కమిటీలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ సర్కారుపై మండిపడ్డారు.

 "తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై బీజేపీ రాజీలేని పోరాటం సాగిస్తుందని కన్నా స్పష్టం చేశారు.
Kanna Lakshminarayana
TTD
Assets
Andhra Pradesh
BJP

More Telugu News