Charmme: విజయ్ సెట్స్ లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు: చార్మి

There will be no tensions when Vijay Devarakonda is in sets says Charmme
  • విజయ్ సెట్లో ఉంటే హాయిగా ఉంటుంది
  • అనన్యలో మంచి టాలెంట్ ఉంది
  • 'ఫైటర్'కు మంచి టైటిల్ ఫిక్స్ చేస్తాం
హీరో విజయ్ దేవరకొండ సెట్లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవని సినీ నటి, నిర్మాత ఛార్మి అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఫైటర్' వర్కింగ్ టైటిల్ తో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది.

తాజాగా ఛార్మి మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి టైటిల్ ను ఫిక్స్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని చెెప్పారు. అనన్యలో మంచి టాలెంట్ ఉందని తెలిపారు. విజయ్ సెట్స్ లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెప్పారు.
Charmme
Vijay Devarakonda
Puri Jagannadh
Ananya Pandey
Tollywood

More Telugu News