Nawazuddin Siddiqui: నాకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవు: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ భార్య

Aactor Nawazuddins wife Aalias response on her affairs
  • 2009లో అలియాను రెండో వివాహం చేసుకున్న నవాజుద్దీన్
  • భార్యాభర్తల మధ్య కొంత కాలంగా వివాదాలు
  • విడాకుల నోటీసు పంపించిన అలియా
బాలీవుడ్ లో పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయాలుగా మారిపోయాయి. వైవాహిక సంబంధాలకు విలువే లేనట్టుగా... విడాకులకు సిద్ధమైపోతున్నారు. అభిప్రాయాలు కలవడం లేదని చాలా సింపుల్ గా చెప్పేస్తూ విడిపోతున్నారు. ఆ వెంటనే మరో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.

తాజాగా నటుడు నవాజుద్దీన్ సిద్ధఖీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న సిద్ధిఖీ... 2009లో అలియాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, నవాజ్ నుంచి విడాకులు కోరుతూ ఈ నెల 7న అలియా విడాకుల నోటీసులు పంపారు. అయితే ఆమెకున్న అఫైర్స్ కారణంగానే విడాకులు కోరిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పట్ల ఆమె ఘాటుగా స్పందించారు. తనకు ఎవరితోను అఫైర్స్ లేవని... ఇవన్నీ తప్పుడు వదంతులు అని చెప్పారు. వాస్తవాలను వెల్లడించేందుకే తాను ట్విట్టర్ ఖాతాను తెరిచానని వెల్లడించారు.

నవాజ్ తమను చాలా కాలంగా పట్టించుకోవడం మానేశాడని అలియా విమర్శించారు. నాన్న ఎక్కడని తమ ఇద్దరు పిల్లలు అడిగినప్పుడు ఆయనకు ఫోన్ చేసేదాన్నని... షూటింగ్ లో ఉన్నానని, వేరే వారితో మాట్లాడే పని ఉందని చెప్పేవాడని తెలిపారు. ఇంటికి వచ్చేవాడు కాదని అన్నారు.

ఒకసారి ఇంటికి మరో నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి వచ్చారని... అయన ముందు కూడా తనను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏరోజు బయటకు తీసుకెళ్లలేదని చెప్పారు. ఒక భార్యకు దక్కాల్సిన గౌరవం తనకు లభించలేదని అన్నారు. కొన్నేళ్లుగా తాను క్షోభను అనుభవిస్తున్నానని... ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేశాడని మండిపడ్డారు.
Nawazuddin Siddiqui
Wife
Aalia
Bollywood
Affair
Divorce

More Telugu News