vanisri: గుండెపోటు కాదు.. సినీ నటి వాణిశ్రీ కుమారుడిది ఆత్మహత్య!

vanisri son passes away
  • తమిళనాడులో ఫాంహౌస్‌లో బలవన్మరణం
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్న అభినయ్
  • పలు సమస్యల కారణంగా మనస్తాపం
అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లో ఆయన ఈ ఘటనకు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు.

పలు సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఆయన గుండెపోటుతో మృతి చెందాడని ముందుగా వార్తలు వచ్చాయి. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు (4), కుమార్తె  ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలిగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
vanisri
Tollywood
Tamilnadu

More Telugu News