పిల్లిని చంపి.. టిక్ టాక్ వీడియో.. యువకుడి అరెస్టు!

23-05-2020 Sat 12:11
  • తమిళనాడు, తిరునల్వేలి జిల్లాలో ఘటన
  • టిక్‌టాక్‌లో పాప్యులర్ అవ్వాలని యువకుడి చర్య 
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
TN police arrest 18 year old for posting TikTok video after killing a cat

టిక్‌టాక్‌లో పాప్యులర్ అయిపోవడం కోసం యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. మూగజీవాలపై హింసకు పాల్పడుతూ చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంట్లో పిల్లిని చంపడమే కాకుండా ఈ దారుణ దృశ్యాలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు ఓ కుర్రాడు (18). ఇలా చేస్తే అధిక లైక్‌లు, షేర్‌లు వచ్చి పాప్యులర్ అయిపోతానని అనుకున్నాడు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సెట్టికుళంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు తంగదురై అని, పశువుల ఫాంలో పని చేస్తుంటాడని, తన పెంపుడు పిల్లిని ఇంట్లో తాడుతో దూలానికి ఉరితీస్తూ వీడియో తీశాడని పోలీసులు వివరించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వీడియోల కోసం మూగజీవాలపై హింసకు పాల్పడి అరెస్టయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.