China: గూఢచర్యానికి పాల్పడుతున్నాయట.. 30 చైనా కంపెనీలకు అమెరికా షాక్!

  • ఉగర్లపై చైనా అణచివేత ధోరణిపై అమెరికా మండిపాటు
  • చైనా మిలటరీతో సంబంధాలున్నాయంటూ బ్లాక్ లిస్ట్
  • చైనా అణచివేత కార్యక్రమంలో ఈ కంపెనీలకు భాగం ఉందన్న అమెరికా
US blacklists 33 China firms

చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించింది.

చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి ఇవి పాల్పడుతున్నాయని పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.

More Telugu News