Sujana Chowdary: ఇలా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది: ఏపీ ప్రభుత్వంపై సుజనా చౌదరి ఫైర్

  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని 151 సీట్లతో గెలిపించారు
  • రాజ్యాంగ వ్యవస్థలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదు
  • ఇప్పటికైనా సరైన పాలన అందించాలని కోరుతున్నాను
  • సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయట్లేదు
sujana on ycp rule

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదని మండిపడ్డారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని 151 సీట్లతో గెలిపించారు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదు. ఇప్పటికైనా మీ పనితీరును సమీక్షించుకుని, ప్రజలకు సరైన పాలన అందించాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా చీమకుట్టినట్టయినా లేదు. చివరకు సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయకుండా తామనుకున్నట్టుగా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది' అని సుజనా చౌదరి మండిపడ్డారు.

More Telugu News