భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 6,654 కరోనా కేసులు

23-05-2020 Sat 09:17
  • గత 24 గంటల్లో 137 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 3,720
  • మొత్తం కేసుల సంఖ్య 1,25,101
  • 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
Highest ever spike of 6654

దేశంలో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
               
దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,25,101కి చేరింది. 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.