మాస్కు ధరించి ఆసుపత్రికి వెళ్లిన కోలీవుడ్ నటుడు అజిత్.. అభిమానుల్లో ఆందోళన

23-05-2020 Sat 08:59
  • ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించిన అజిత్
  • రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే అంటున్న వర్గాలు
  • తండ్రిని పరామర్శించేందుకేనని మరో వాదన
Ajith and Shalini hospital visit during coronavirus lockdown leave fans worried

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన భార్య షాలినితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వస్తున్న వీడియో వైరల్ కావడం ఆయన అభిమానుల్లో చర్చకు దారితీసింది. మాస్కులు ధరించి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి వారు ఇంటికి వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అజిత్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో వారు ఆసుపత్రికి వెళ్లి రావడం సహజంగానే అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

అయితే, వారు రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఇందులో ఆందోళన చెందాల్సిందేమీ లేదని చెబుతున్నారు. మరోవైపు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకే అజిత్ ఆసుపత్రికి వెళ్లినట్టు మరికొందరు చెబుతున్నారు. అయితే, అజిత్ మేనేజర్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.