సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

23-05-2020 Sat 07:40
  • 'చంద్రముఖి' సీక్వెల్ లో సిమ్రన్ 
  • బన్నీ అప్పుడే షూటింగులకు రాడట!
  • శేఖర్ కమ్ముల మరో చిత్రం 
Simran to play Jyothikas role in Chandramukhi sequel
 *  రజనీకాంత్ హీరోగా గతంలో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయింది. ఇప్పుడీ చిత్రానికి దర్శకుడు పి.వాసు సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇక జ్యోతిక పాత్రను నిన్నటితరం కథానాయిక సిమ్రన్ పోషించనున్నట్టు తాజా సమాచారం.    
*  త్వరలో తెలంగాణలో సినిమా షూటింగులు ప్రభుత్వ అనుమతితో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు చిత్ర నిర్మాతలు తమ చిత్రాల షూటింగులకు రెడీ అవుతున్నారు. అయితే, అల్లు అర్జున్ మాత్రం అప్పుడే షూటింగులలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడట. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోవడంతో మరో రెండు నెలల తర్వాతే తాను 'పుష్ప' చిత్రం షూటింగులో పాల్గొంటాడని తెలుస్తోంది.
*  ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారాయణ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత కూడా తన తదుపరి చిత్రాన్ని శేఖర్ కమ్ముల ఈ నిర్మాతకే చేయనున్నాడట. అందులో ఓ పెద్ద హీరో నటిస్తాడనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ అంటున్నారు.