ఫ్లైట్ క్రాష్ లో నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: పాకిస్థాన్ నటి

22-05-2020 Fri 21:00
  • పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం
  • నటి అయేజా, ఆమె భర్త మరణించారని వార్తలు
  • విమానంలో తాము లేమని ప్రకటించిన అయేజా
I am not dead says Pak actress Ayeza Khan

పాకిస్థాన్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది క్రూ సిబ్బంది విమానంలో ఉన్నారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రమాదంలో పాక్ సినీ నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ మరణించినట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ వార్తలను అయేజా ఖాన్ ఖండించింది. తాను బతికే ఉన్నానని తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తాము లేమని తెలిపింది. ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది.