BJP: సస్పెండ్ చేసిన రెండు రోజులకే బీజేపీలో చేరిన డీఎంకే సీనియర్ నేత

DMK General Secretary Duraisamy joins Tamil Nadu BJP
  • బీజేపీలో చేరిన డీఎంకే నేత దురైసామి
  • డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పని చేసిన దురైసామి
  • తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరిక
డీఎంకే సీనియర్ నేత వీపీ దురైసామి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్, సీనియర్ నేత గణేశన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. డీఎంకే మాజీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దురైసామి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారని తమిళనాడు బీజేపీ తెలిపింది.

మరోవైపు రెండు రోజుల క్రితమే దురైసామిని డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మురుగన్ తో భేటీ అయ్యారనే కారణాలతో ఆయనపై వేటు వేసింది. తమిళనాడులో బలపడేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. రజనీకాంత్ వంటి సెలబ్రిటీలను ఆకర్షించేందుకు కూడా ప్రయత్నించింది.
BJP
DMK
Tamil Nadu
Duraisamy

More Telugu News