New York: న్యూయార్క్ లో ఆకలి కేకలు.. తిండి దొరక్క అల్లాడుతున్న పేదలు!

  • న్యూయార్క్ లో 10 లక్షల మంది పేదలు
  • కరోనాతో 20 లక్షలకు చేరుకున్న పేదల సంఖ్య
  • వచ్చే వారం నుంచి పేదలకు ఉచిత భోజన కేంద్రాలు
Screams of hunger in the financial capital of USA

ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత బలమైన దేశం అమెరికా. అలాంటి దేశంలో ఇప్పుడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇది నిజం. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా విషాదమే కనిపిస్తోంది. కనీసం ఒక్క పూట తినడానికి తిండి లేక పేదలు అల్లాడుతున్నారు.

ఈ సందర్భంగా న్యూయార్క్ మేయర్ మాట్లాడుతూ, గతంలో నగరంలో 10 లక్షల మంది పేదలు ఉండేవారని.. కరోనా కారణంగా ఆ సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. వచ్చే వారం నుంచి పేదల కోసం ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అమెరికాలో మొత్తం 16.30 లక్షల మంది కరోనా  బారినపడ్డారు. వీరిలో 3.60 లక్షల మంది న్యూయార్క్ వాసులే కావడం గమనార్హం. యూఎస్ లో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువవుతోంది.

  • Loading...

More Telugu News