కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న పాకిస్థాన్!

22-05-2020 Fri 17:41
  • పాకిస్థాన్ లో 50 వేలు దాటిన కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 2,603 మందికి వైరస్
  • ఇప్పటి వరకు 1,067 మంది మృతి
Pakistan suffering from corona virus

ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి... పాకిస్థాన్ ను గడగడలాడిస్తోంది. అసలే పేదరికంతో మగ్గుతున్న పాక్ ను బెంబేలెత్తిస్తోంది. పాక్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలను దాటడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు మొత్తం 50,694 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2,603 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 1,067 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 15,201 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, వాస్తవంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.