పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే మాకు దిక్కు: డాక్టర్ సుధాకర్ తల్లి

22-05-2020 Fri 13:43
  • డాక్టర్ సుధాకర్ పై పోలీసుల వైఖరి పట్ల హైకోర్టు ఆగ్రహం
  • ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
  • హైకోర్టు తీర్పు సంతోషం కలిగించిందన్న డాక్టర్ సుధాకర్ తల్లి
Mother of Doctor Sudhakar responds on High Court verdict

ఇటీవల సస్పెండైన డాక్టర్ సుధాకర్ పై విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై డాక్టర్ సుధాకర్ తల్లి స్పందించారు. హైకోర్టు తీర్పు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. తన కుమారుడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, పరువు కాపాడుకోవాలంటే తమకు హైకోర్టే దిక్కు అని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఇంత జరిగినా అధికారులు ఎవరూ రాలేదని ఆమె ఆక్రోశించారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు.