తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసి.. సూచనలు చేసిన మహేశ్ బాబు!

22-05-2020 Fri 13:38
  • అందరూ మాస్కులు ధరించాలి
  • క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయి
  • ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి
  • జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోంది
We are opening up Slowly but surely

తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో మహేశ్ బాబు సూచన చేశాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయని ఆయన గుర్తు చేశాడు.

ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించాలని ఆయన సూచించాడు. దీనివల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతామని చెప్పాడు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోందని ఆయన అన్నాడు. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిదని చెప్పాడు. 'నేను మాస్కు ధరించాను.. మరి మీరు?' అంటూ మహేశ్ బాబు ప్రశ్నించాడు.