సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి చేయాలన్న వైద్యులు!

22-05-2020 Fri 13:06
  • కాలేయ సమస్యలతో బాధపడుతున్న లిరిక్ రైటర్ అశోక్ తేజ
  • గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స
  • త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు
Lyricist Suddala Ashok Teja needs Lever transplantation

ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయన చేరారు.

ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, ప్రస్తుతం అశోక్ తేజ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ (కాలేయ మార్పిడి) చేయాలని చెప్పారు. అయితే, లాక్ డౌన్ కారణంగా బ్లడ్ కొరతగా ఉందని తెలిపారు. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూపు బి-నెగెటివ్ అని, రక్త దాతల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. మరోవైపు అశోక్ తేజ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.