Village Secretariat: మహిళా సిబ్బంది ఉండగానే కార్యాలయంలో మసాజ్ చేయించుకున్న వీఆర్వో!

VRO had massage in village secretariat in East Godavari
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • గ్రామ సచివాలయంలో మసాజ్ చేయించుకున్న వీఆర్వో
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
కొంత మంది అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరు మొత్తం వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కిర్లంపూడి మండలం వేలంక గ్రామ సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న భాస్కరరావు చేసిన పని ఇప్పుడు విమర్శలపాలు అవుతోంది.

ఆఫీసులో మహిళా వాలంటీర్లు, ఇతర సిబ్బంది ఉన్న సమయంలోనే బాడీ మసాజ్ చేసే వ్యక్తిని ఆయన పిలుపించుకున్నారు. తన సీటులోనే కూర్చొని మసాజ్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. వీఆర్వో చేసిన పనికి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Village Secretariat
VRO
Massage
East Godavari District

More Telugu News