కాబోయే భర్త రానాతో దిగిన ఫొటోలను మొదటిసారి షేర్‌ చేసిన మిహీకా.. ఆసక్తికర వ్యాఖ్యలు!

22-05-2020 Fri 12:09
  • నా ప్రియమైన రానాతో జీవితం ప్రారంభమైంది
  • మై హ్యాపీ ప్లేస్‌ రానా
  • అలరిస్తోన్న ఫొటోలు        
rana engagement images

తనకు కాబోయే భర్త, సినీనటుడు రానాతో దిగిన పలు ఫొటోలను తొలిసారి పోస్ట్ చేసిన మిహీకా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ప్రియమైన రానాతో జీవితం ప్రారంభమైందంటూ పేర్కొంది. మై హ్యాపీ ప్లేస్‌ రానా అని చెప్పింది. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోలో.. మిహీకా చెవిలో రానా ఏదో చెబుతుంటే ఆమె నవ్వుతున్నట్లు ఉంది. మరో రొమాంటిక్ ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

 ఇప్పటికే మిహీకాతో దిగిన పలు ఫొటోలను రానా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అవి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ రెండు కుటుంబాలు హైదరాబాద్‌లో కలుసుకుని పెళ్లి నిశ్చితార్థం, ముహూర్తంలపై చర్చించుకున్నాయి.