Keerthy Suresh: మేకప్ లేకుండా కీర్తి సురేశ్... ఇలా!

Keerthi Suresh without Makeup
  • ఇన్ స్టాలో 50 లక్షలు దాటిన కీర్తి ఫాలోవర్స్
  • మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు
  • స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన కీర్తి సురేశ్ 
మహానటి' చిత్రంతో అశేష సినీ ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేశ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందమైన రూపం, చక్కని హావభావాలతో అందరినీ అలరించి, మెప్పించిన కీర్తి, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటగా, ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి, ఆమె ఓ వీడియోను తయారు చేసి పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో కీర్తీ సురేశ్ మేకప్ లేకుండా కనిపించడం గమనార్హం. తన పెట్ డాగ్ తో కలిసి ఈ వీడియోను రూపొందించింది. మనది ఇప్పుడు 50 లక్షల మందితో నిండిన కుటుంబమని, తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం కీర్తి, 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'రంగ్ దే' తదితర చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాల షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు నిలిచిపోగా, నిబంధనలు తొలగిపోగానే కీర్తి బిజీ కానుంది.
Keerthy Suresh
Mahanati
Instagram

More Telugu News