Lockdown: హైదరాబాద్ లో లాక్ డౌన్ లో స్వాధీనం చేసుకున్న వాహనాలపై పోలీసుల కీలక నిర్ణయం!

  • లాక్ డౌన్ లో దాదాపు 3.25 లక్షల వాహనాలు స్వాధీనం
  • ఈ-కోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు
  • ముందుగానే టైమ్ స్లాట్, తేదీ ఇవ్వనున్న పోలీసులు
Telangana Police Decission on Vehicles

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ నిబంధనలు విధించగా, వాటిని ఉల్లంఘిస్తూ, ఎటువంటి కారణమూ లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇప్పుడు వాహనదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కోర్టుకు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఈ-కోర్టు ద్వారా కేసులను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

జంట నగరాల పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం పోలీసుల వద్ద లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 3.25 లక్షల వాహనాలు ఉండగా, వీటిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిష్కరించాలని కోర్టులను పోలీసులు కోరారు. కోర్టుల నుంచి అనుమతి రాగానే, వాహనాలను, నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసులు నమోదైన వారికి ముందుగానే తేదీ, టైమ్ స్లాట్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు.

More Telugu News