Anantapur District: కటకటాల వెనక్కి పంపిన టిక్‌టాక్ సరదా

Man arrested for tiktok with wild animals
  • అనంతపురం జిల్లాలో ఘటన
  • జింక పిల్లకు మేకపాలు తాగిస్తూ..
  • కుక్కలకు కుందేలు మాంసాన్ని వేస్తూ టిక్‌టాక్

టిక్‌టాక్ మోజు ఓ యువకుడిని కటకటాల వెనక్కి నెట్టింది. అనంతపురం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నాగార్జున ఆత్మకూరు రేంజ్ అటవీశాఖ పరిధిలో ఓ జింక పిల్లను పట్టుకుని మేకపాలు తాగిస్తూ టిక్‌టాక్ వీడియో చేశాడు.

అలాగే, కుందేలు మాంసాన్ని కుక్కలకు వేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టుచేశాడు. విషయం అధికారుల దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. నిందితుడు నాగార్జునను పట్టుకున్న అటవీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News